కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET) PG ప్రవేశాలకు దరఖాస్తు గడువు ఇవాళ్టితో ముగియనుంది. https://exams.nta.ac.in/ వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తుల్లో సవరణకు ఈనెల 10-12 వరకు అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా ప్రముఖ సెంట్రల్, ప్రైవేట్ వర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం CUET నిర్వహిస్తారు. 157 సబ్జెక్టుల్లో మార్చి 13 నుంచి 31 వరకు పరీక్షలు జరుగుతాయి.