ఎండలతో అల్లాడిపోతున్న ఏపీకి ఊరట లభించనుంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన తుపాను తరహా వాతావరణ పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో జూన్ 12 నుంచి ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని ఐఎండీ వెల్లడించింది. దక్షిణ కోస్తాలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడొచ్చని హెచ్చరించింది. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.