ప్రస్తుత సమాజంలో యువత మొత్తం రీల్స్ మీదే ఫోకస్ పెడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా నోయిడాకు చెందిన ముగ్గురు వ్యక్తులు కారుతో ప్రమాదకర స్టంట్స్ చేసిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. టొయోటా ఫార్చునర్ కారుపై ఓ వ్యక్తి విండ్‌షీల్డ్‌పై కూర్చున్నారు. మరో ఇద్దరు రెండు వైపులా కారు డోర్లకు వేలాడుతూ కనిపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు వారికి రూ.33,000 చలాన్ విధించారు.