ప్రమాదకర వైరల్ ఫీవర్.. డెంగ్యూ

54చూసినవారు
ప్రమాదకర వైరల్ ఫీవర్.. డెంగ్యూ
జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం ప్రతి ఏటా మే 16న దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ 2010లో దీనిని ప్రారంభించింది. డెంగ్యూ ఒక ప్రమాదకర వైరల్ ఫీవర్, ఆడ ఏడిస్ ఈజిప్టై జాతికి చెందిన దోమ కాటు ద్వారా వ్యాపిస్తుంది. దోమ లాలాజలంలోని వైరస్ మానవ శరీరంలోకి ప్రవేశించి తీవ్ర జ్వరం, ఎముకల నొప్పులు కలిగిస్తుంది. ఈ దినోత్సవం ద్వారా నీటి నిల్వల శుభ్రత, దోమల నివారణ వంటి చర్యలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తారు.

సంబంధిత పోస్ట్