అధిక రక్తపోటు (హైబీపీ) వల్ల రక్తనాళాలలో కొవ్వు పేరుకుపోవడం, పక్షవాతం, గుండెపోటు వంటి ప్రమాదాలకు దారితీస్తుంది. దీర్ఘకాలంగా హైబీపీ ఉంటే గుండె వాపు, గుండె వైఫల్యం రావచ్చు. ఇంకా మూత్రపిండాలు దెబ్బతిని, డయాలసిస్ చేసుకునే పరిస్థితి కూడా రావొచ్చు. కళ్ళపై ప్రభావం పడి చూపు కూడా మందగిస్తుంది. జ్ఞాపకశక్తి క్షీణించే అవకాశం ఉంది. రక్తపోటును నియంత్రించడం ద్వారా ఈ సమస్యలను నివారించవచ్చు.