AP: వైఎస్ వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన షేక్ దస్తగిరి కడప జైలులో విచారణకు హజరయ్యారు. దస్తగిరిని విచారణ అధికారి రాహుల్ శ్రీరామ విచారిస్తున్నారు. 2023 నవంబర్లో తనకు ఎదురైన బెదిరింపులు, ప్రలోభాలపై విచారణ అధికారికి దస్తగిరి వివరించారు. కాగా దస్తగిరి, డాక్టర్ చైతన్య రెడ్డి, జైలు సూపరింటెండెంట్ ప్రకాశ్ ఇబ్బంది పెట్టినట్లు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.