AP: కూటమి ప్రభుత్వం పేదలకు గుడ్ న్యూస్ చెప్పింది. 3 లక్షల ఇళ్ల పంపిణీకి ముహూర్తం ఖరారు చేసింది. ఇప్పటికే రెండున్నర లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. మరో 50 వేల ఇళ్లను త్వరితగతిన నిర్మించనున్నారు. శ్రావణమాసంలో మొత్తం 3 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి.