ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దీపం లబ్ధిదారులకు ఒకేసారి 3 సిలిండర్ల సొమ్ము ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని సీఎం చంద్రబాబు అదికారులను ఆదేశించారు. డేటా అనలటిక్స్‌కు అన్ని శాఖల్లో అత్యంత ప్రాధాన్యమివ్వాలని అధికారులకు సీఎం మార్గనిర్దేశం చేశారు. ఈ క్రమంలో దీపం-2 పథకం పై రాష్ట్ర ప్రజలు త్వరలోనే శుభవార్త అందుకోనున్నట్లు సమాచారం.