AP: రాష్ట్ర ప్రభుత్వం దీపం-2 పథకం కింద లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేసిందని మంత్రి అనిత తెలిపారు. మొత్తం రూ.1 కోటి 55 లక్షల లబ్ధిదారులలో 91,36,235 మంది సిలిండర్లు బుక్ చేసుకోగా.. 86,60,522 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ. 687.38 కోట్ల సబ్సిడీ జమ అయ్యిందని స్పష్టంచేశారు. ప్రభుత్వం రూ. 691.54 కోట్లను సబ్సిడీ కోసం విడుదల చేసిందని అమంత్రి అనిత ట్వీట్ పేర్కొన్నారు.