దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం మూడిండికి 46.55 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుండటంతో ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రముఖులు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఫిబ్రవరి 8న ఢిల్లీ పీఠం ఎవరిదో తేలనుంది.