ఢిల్లీ ఎన్నికలు.. 11 గంటల వరకు పోలింగ్‌ శాతం ఎంతంటే?

81చూసినవారు
ఢిల్లీలో శాసనసభ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ఉదయం ఏడు గంటలకు ఓటింగ్‌ ప్రారంభం కాగా.. ఉదయం 11 గంటల వరకు 19.95 శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ అసెంబ్లీ ఎన్నికలతో పాటు తమిళనాడులోని ఈరోడ్‌(ఈస్ట్‌), ఉత్తర్‌ప్రదేశ్‌లోని మిల్కిపుర్‌లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రెండు ప్రాంతాల్లో 26.03 శాతం, 29.86 శాతం పోలింగ్ నమోదైంది. ఈనెల 8న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు.

సంబంధిత పోస్ట్