ఢిల్లీ ఎగ్జిట్‌పోల్స్ ప్రకారం.. త్రిముఖ పోరులో గెలిచేది బీజేపీనే అని స్పష్టంగా తెలుస్తోంది. అన్ని ఎగ్జిట్‌పోల్స్ లో బీజీపీ ఆధిక్యంలో ఉంది. 25 ఏళ్ల తరువాత ఢిల్లీలో బీజేపీ గెలుస్తుందని మెజారిటీ ఎగ్జిట్‌పోల్స్ చెబుతున్నాయి. ఢిల్లీ మొత్తం 70 స్థానాలు కాగా మెజారిటీ దక్కాలంటే 36 స్థానాలు దక్కాలి. పోల్ ఆఫ్ పోల్స్‌లో కూడా బీజేపీకే ఆధిక్యం లభించింది. ఈ నెల 8న ఢిల్లీ ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టారో తెలుస్తోంది.