ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి ఫలితం వెలువడింది. మొదటి విజయాన్ని ఆప్ సొంతం చేసుకుంది. కోండ్లీ నియోజకవర్గ స్థానం నుంచి ఆప్ అభ్యర్థి కుల్‌దీప్ కుమార్ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి ప్రియాంక గౌతమ్‌పై 6,293 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మరోవైపు BJP కూడా ఖాతా తెరిచింది. లక్ష్మీనగర్ నియోజకవర్గ స్థానం నుంచి అభయ్ వర్మ విజయం సాధించారు.