ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ ఖాతా వరుస విజయాలతో దూసుకుపోతోంది. షాలిమార్ బాగ్ నియోజకవర్గం నుంచి కమలం పార్టీ అభ్యర్థి రేఖ గుప్తా తన సమీప అభ్యర్థి బందన కుమారిపై 29595 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. ఇప్పటివరకు వెలువడిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 17 స్థానాల్లో గెలుపొందగా ఆమ్ ఆద్మీ పార్టీ 6 స్థానాలు దక్కించుకుంది.