ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడ్డాయి. 70 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న ఢిల్లీలో బీజేపీ మొత్తం 48 సీట్లను సాధించగా.. ఆమ్ ఆద్మీ పార్టీ 22 స్థానాలను గెలుచుకుంది. కాగా, ఈ ఫలితాల్లో బీజేపీ, కాంగ్రెస్‌లకు ఓట్ల వాటా పెరిగింది. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఆప్ ఓట్ల వాటా 10 శాతం తగ్గింది. దాంతో బీజేపీకి ఏడు శాతం, కాంగ్రెస్‌కు రెండు శాతం ఓట్ల వాటా పెరిగింది.