ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ వెనుకంజలో ఉన్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఆప్ కేవలం 22 స్థానాలకు పరిమితమైంది. ఈ క్రమంలో ఢిల్లీ సచివాలయాన్ని సీజ్ చేయాలంటూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఎల్జీ ఆదేశాలు జారీ చేశారు. ఒక్క ఫైల్ కూడా బయటకు వెళ్లకూడదని అధికారులకు తెలిపారు. కాగా ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీలు ఫైల్స్‌ను మాయం చేయడం, కాల్చివేయడం చేస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.