నేడు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ పక్షనేత రాహుల్ గాంధీ దేశ పౌరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘దేశ ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనకు స్వేచ్ఛ అనేది ఒక పదం కాదు. ఇది రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలతో ముడిపడి ఉన్న అతిపెద్ద రక్షణ కవచం. నిజం మాట్లాడే సామర్థ్యం, కలలను నెరవేర్చే ఆశ… జైహింద్’ అని రాహుల్ పోస్టులో పేర్కొన్నారు.