AP: విశాఖ, భీమునిపట్నం బీచ్‌ల వద్ద అక్రమ నిర్మాణాలను కూల్చేయొచ్చని హైకోర్డు ఆదేశించింది. అలాగే జిల్లా కలెక్టర్, సీఆర్‌జెడ్ జోనల్ అధికారి, ఇతర అధికారులతో కలిసి కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. నిర్మాణాలను పరిశీలించి.. అవి అక్రమ నిర్మాణాలని రుజువైతే కూల్చేయాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. తదుపరి విచారణలోపు పూర్తి నివేదిక సమర్పించాలని కమిటీని ఆదేశించింది.