డెంగ్యూ బారిన పడకుండా ఉండాలంటే దోమలకు దూరంగా ఉండాలి. పొడవాటి చేతులున్న దుస్తులు ధరించి, ఇంటి చుట్టూ క్రిమిసంహార మందులు చల్లుతూ ఉండాలి. నీటి గుంటలు, తడి చెత్త ఉండకుండా చూసుకోవాలి. అలాగే టైర్లు, గిన్నెల్లో నీరు నిలవకుండా చూసుకోవాలి. ఎందుకంటే నీటిలో దోమలు పెరుగుతాయి. డెంగ్యూ సోకిన రోగులను చూసుకునేవారు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉంది.