AP: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జ్వరం నుంచి కోలుకున్నారు. మూడు రోజులుగా తీవ్ర జ్వరం కారణంగా ఆయన సినిమా షూటింగ్‌తో పాటు కేబినెట్ సమావేశానికి సైతం హాజరుకాలేదు. బెడ్ రెస్ట్‌లో ఉన్నారు. ఆయన జ్వరం నుంచి పూర్తిగా కోలుకోవడంతో దక్షిణాది రాష్ట్రాల పర్యటనకు సిద్ధం అయ్యారు. ఈ నెల 12, 13, 14 తేదీల్లో కేరళ, తమిళనాడులోని అనంత పద్మనాభ స్వామి, మధుర మీనాక్షి, కుంభేశ్వర దేవాలయం, తదితర ఆలయాలను పవన్ సందర్శించనున్నారు.