పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి చెందిన సుజాత (33) పుట్టుకతోనే పోలియో బారినపడి చలనం లేకుండా జీవిస్తున్నా, తండ్రి రామచంద్ర రావు ప్రోత్సాహంతో ఎంబీఏలో ఉత్తీర్ణత సాధించారు. ప్రస్తుతం సుజాత ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నా, ఇప్పటికీ అవకాశం దక్కలేదు. నెలకు వచ్చే రూ.6 వేల దివ్యాంగుల పింఛన్ మాత్రమే జీవనాధారం. ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని CM, డిప్యూటీ CMలను కలిసేందుకు సచివాలయానికి వెళ్లారు.