ఎన్డీఏ ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లని సీఎం చంద్రబాబు తెలిపారు. సంపదను సృష్టించి ఆదాయాన్ని పెంచి సంక్షేమ కార్యక్రమాలకు వినియోగిస్తున్నామని వివరించారు. ఈ దిశగా తల్లికి వందనం కార్యక్రమాన్ని ప్రారంభించామని, ఇందుకు అమ్మఒడి నిబంధనల ప్రకారమే అమలు చేస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం నలభై రెండు లక్షల మందికి అందించిందని, తమ ప్రభుత్వం అరవై ఏడు లక్షల మందికి అందిస్తోందని వెల్లడించారు.