రథసప్తమికి తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. శ్రీకాకుళంలోని అరసవిల్లిలోని సూర్య భగవానుడిని దర్శించుకునేందుకు సోమవారం అర్ధరాత్రి నుంచే భక్తులు పోటెత్తారు. భక్తులు స్వామి నిజరూప దర్శనం చేసుకున్నారు. మరోవైపు తిరుమలలో రథసప్తమి వేడుకలను టీటీడీ ప్రారంభించింది. సూర్య ప్రభవాహనంపై తిరుమాడవీధుల్లో మలయప్ప స్వామి ఊరేగింపు సాగుతోంది. యాదాద్రిలోనూ స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా వచ్చారు.