కుంభమేళాకు పోటెత్తిన భక్తులు (VIDEO)

73చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు వసంతపంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని వివిధ ప్రాంతాల నుంచి సోమవారం భక్తులు పోటెత్తారు. త్రివేణీ సంగమం హరహర మహాదేవ్ నినాదాలతో మార్మోగింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమంలో దాదాపు 10 లక్షల మంది నాగసాధువులు, సన్యాసులు అమృత స్నానాలు చేశారు. మొత్తం రెండు కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్