ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రకటించిన ఉచిత గ్యాస్ సిలిండర్ మొదటి విడత ఇంకా తీసుకోని వారు బాధపడాల్సిన పనిలేదు. వారికి ఇంకా గడువు ఉందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. దీపం-2 పథకం కింద లబ్ధిదారులు మార్చి 31 లోపు ఎప్పుడైనా ఉచిత సిలిండర్ ను బుక్ చేసుకుని పొందవచ్చని ఏపీ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహనకృష్ణ తెలిపారు. మొత్తం 1.55 కోట్ల లబ్ధిదారులలో ఇప్పటి వరకు 91,36,235 మంది సిలిండర్లు బుక్ చేసుకున్నట్లు తెలిపారు.