ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై నమోదైన క్రిమినల్ కేసును తొలగిస్తూ గుంటూరు ప్రత్యేక న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది జులై 9న ఏలూరులో నిర్వహించిన వారాహి సభలో పవన్.. కొంత మంది వాలంటీర్లు అసాంఘిక శక్తులుగా మారారని ఆరోపించారు. దీనిపై గతంలో వాలంటీర్లు ఫిర్యాదు చేశారు. అయితే పవన్‌పై ఫిర్యాదు చేసిన వాలంటీర్లను తాజాగా న్యాయస్థానం విచారించగా.. తమకు ఈ కేసుతో సంబంధం లేదని చెప్పారు.