వైసీపీ ఎమ్మెల్సీ రఘురాజుపై అనర్హత వేటు రద్దు

75చూసినవారు
వైసీపీ ఎమ్మెల్సీ రఘురాజుపై అనర్హత వేటు రద్దు
విజయనగరం వైసీపీ ఎమ్మెల్సీ రఘురాజుపై అనర్హత వేటును హైకోర్టు రద్దు చేసింది. మండలి ఛైర్మన్ నిర్ణయాన్ని కోర్టు తోసిపుచ్చింది. దీంతో ఆయన 2027 నవంబర్ 31 వరకు ఎమ్మెల్సీగా కొనసాగనున్నారు. అయితే అనర్హత వేటు కారణంగా ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయింది. తాజాగా వైసీపీ అభ్యర్థిని కూడా ప్రకటించింది. రఘురాజుకు ఊరట లభించడంతో ఈ ఎన్నికను రద్దు చేసే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్