క్రిమినల్ కేసుల్లో అభియోగాలు ఎదుర్కొనే జువెనైల్ బెయిల్‌కు సంబంధించి సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇతర నేరస్థుడితో సంబంధం, బాధితులకు భౌతికంగా, మానసికంగా ప్రమాదం ఉందని తేలితే తప్ప.. వారికి బెయిల్ నిరాకరించవద్దని స్పష్టం చేసింది. మైనర్‌పై లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలైన ఓ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ఈ విధంగా వ్యాఖ్యానించింది.