ఏపీలో ఈ కఠిన చట్టం గురించి తెలుసా!

50చూసినవారు
ఏపీలో ఈ కఠిన చట్టం గురించి తెలుసా!
ఆంధ్రప్రదేశ్ ఓ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తోంది. గతేడాది 45మందికి కఠిన జైలు శిక్షలు పడ్డాయి. ఈ మేరకు జాగ్రత్తగా ఉండాలని.. ముఖ్యంగా యువతను అలర్ట్ చేయాల్సి అవసరం ఉంది. ఒకసారి కేసు నమోదైతే జీవితాంతం ఇబ్బందులు తప్పవు. రాష్ట్రంలో ఎన్‌డీపీసీ చట్టం-1985ను అధికారులు కఠినంగా అమలు చేస్తున్నారు. ఈ చట్టం ప్రకారం 20 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉందంటున్నారు. గంజాయితో పాటుగా డ్రగ్స్ తయారీ, వినియోగం, కుట్ర చేయడం వంటివి చేస్తే ఎన్‌డీపీసీ చట్టం-1985 కింద కేసు న‌మోదు చేస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్