ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ కొంత సమయం కచ్చితంగా నడవాలని నిపుణులు పేర్కొంటున్నారు. రోజులో 45 నిమిషాలు పాటు వాకింగ్ చేయడం వల్ల బరువు తగ్గడంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందట. రోజూ గంటపాటు వాకింగ్ చేయడం వల్ల డోపామైన్ విడుదలై శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుందట. అలాగే జీర్ణక్రియ మెరుగుపడి, బరువు అదుపులో ఉంటుందని చెబుతున్నారు. ఆహారం తిన్న తర్వాత అరగంట వాకింగ్ చేయడం వల్ల శరీరంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని సూచిస్తున్నారు.