పాకిస్థాన్‌లో హిందువులు ఎక్కువగా ఉన్న ప్రాంతం ఏదో తెలుసా?

69చూసినవారు
పాకిస్థాన్‌లో హిందువులు ఎక్కువగా ఉన్న ప్రాంతం ఏదో తెలుసా?
పాకిస్థాన్‌లో ముస్లింలు మెజారిటీ అయినప్పటికీ, హిందువులు అధికంగా నివసించే ప్రాంతం సింధ్ ప్రావిన్స్‌. విభజనకు ముందు హిందువులు పెద్ద సంఖ్యలో అక్కడ స్థిరపడిన కారణంగా, ఇప్పటికీ అక్కడ హిందువులే అధికం. సింధ్‌లోని ఉమర్‌కోట్, తార్పార్కర్, మిర్‌పుర్‌ఖాస్‌, సంఘర్‌ జిల్లాలు హిందూ మెజారిటీగా గుర్తింపు పొందాయి. నివేదికల ప్రకారం, పాక్‌లో మొత్తం 39 లక్షల హిందువులలో దాదాపు 93 శాతం మంది సింధ్‌లో నివసిస్తున్నారు.

సంబంధిత పోస్ట్