ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్కరికీ ఈపీఎఫ్ ఖాతా గురించి తెలుసు. ఉద్యోగి, యజమాని నుంచి 12% చొప్పున ఈ ఖాతాలో జమ అవుతుంది. ఇక పాత పన్ను విధానం ప్రకారం పీఎఫ్ ఖాతాలో జమ చేసే నగదుపై రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు. ప్రతినెలా పీఎఫ్ ఖాతాలో జమయ్యే మొత్తంపై వడ్డీ లభిస్తుంది. అలాగే సర్వీసులో ఉండగా చందాదారుడికి జరగరానిది జరిగితే ఆ కుటుంబానికి రూ.7 లక్షల వరకు బీమా ప్రయోజనాన్ని ఈపీఎఫ్ఓ అందిస్తుంది.