డెంగ్యూ ఏడిస్ ఈజిప్టి దోమల వల్ల సంక్రమించే వైరల్ ఇన్ఫెక్షన్. ఇది నాలుగు రకాల డెంగ్యూ వైరస్‌ల వల్ల వస్తుంది. దీనిని 'ఎముకలు విరిచే జ్వరం' అని కూడా పిలుస్తారు. ఎందుకంటే డెంగ్యూ వచ్చినప్పుడు తీవ్రమైన కీళ్లు, ఎముకల నొప్పి ఉంటుంది. డెంగ్యూ సంక్రమించినప్పుడు ప్లేట్‌లెట్ కౌంట్ వేగంగా తగ్గి, పరిస్థితి తీవ్రతరం అవుతుంది. అయితే ఈ దోమలు పగలు, సాయంత్రం యాక్టివ్‌గా ఉండి మనుషుల మీద దాడి చేస్తాయి.