కుంకీ ఏనుగులు శిక్షణ పొందిన ఏనుగులు. ఇవి మానవులతో కలిసి పనిచేస్తాయి. భారత్, థాయ్‌లాండ్‌లో ఎక్కువగా కనిపిస్తాయి. వీటిని కుమ్కీ, కూంకీ, తప్పాన్ అని కూడా పిలుస్తారు. అడవి ఏనుగులను బంధించడం, శాంతింపజేయడం, గాయపడిన లేదా ఉచ్చులో చిక్కిన ఏనుగులను రక్షించడం, సంఘర్షణలో అడవి నుంచి వచ్చిన ఏనుగులను తిరిగి అడవిలోకి పంపడం వంటి పనులకు వీటిని ఉపయోగిస్తారు. అడవి ఏనుగులను సాటి ఏనుగుతో కట్టడి చేయడమే కుంకీ ఏనుగు ప్రత్యేకత.