చాలామందికి డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు రక్తంలో ప్లేట్లెట్లు తగ్గడం, రక్తకణాలు క్షీణించడం వల్ల రక్తస్రావం, బీపీ తగ్గడం జరుగుతుంది. ఇది కిడ్నీ, లివర్ వైఫల్యానికి దారితీసి ప్రాణాంతకం కావచ్చు. దీన్ని నివారించడానికి ఎక్కువ నీరు, ఓఆర్ఎస్ తాగాలి. బొప్పాయ ఆకు రసం, కివీ, దానిమ్మ వంటివి ప్లేట్లెట్లు పెంచడానికి సహాయపడతాయి. తక్షణ వైద్య సహాయం తీసుకోవడం, రక్త పరీక్షలు చేయించడం ముఖ్యం.