రక్తపోటు స్థాయి సాధారణ స్థాయి కంటే ఎక్కువగా పెరగడాన్నే హైపర్‌టెన్షన్ అంటారు. రక్తపోటు సాధారణ స్థాయి (120/80) కంటే ఎక్కువగా, 140/90 లేదా అంతకంటే ఎక్కువగా ఉన్నప్పుడు దానిని అధిక రక్తపోటు కింద లెక్కేస్తారు. ఇది ప్రాణాంతక వ్యాధి. అధిక రక్తపోటును నియంత్రించడానికి జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పులు అవసరం. క్రమం తప్పకుండా రక్తపోటును పరీక్షించుకోవడం ముఖ్యం. ఆరోగ్యకరమైన జీవనశైలితో దీనిని నివారించవచ్చు.