‘అలోపేసియా’ వ్యాధి శరీరంలోకి రోగ నిరోధక శక్తి, జుట్టు ఫోలికల్స్‌పై దాడి చేస్తుంది. ఫలితంగా తలపై జుట్టుతో పాటు ముఖం, చేతులపై ఉండే వెంట్రుకలు కూడా ఊడిపోతాయి. ఈ వ్యాధితో బాధపడే వారిలో కొందరికి జుట్టు ఊడిపోవడం స్వల్పంగానే ఉన్నప్పటికీ.. మరికొందరిలో ఈ లక్షణం తీవ్రంగా ఉంటోంది. ఈ వ్యాధి ఎందుకు వస్తుందో అనే దానికి స్పష్టమైన కారణాన్ని శాస్త్రవేత్తలు ఇంకా అధ్యయనం చేయలేదు. జన్యుపరమైన లోపాల వల్ల ఇలా జరగొచ్చని చెబుతున్నారు.