భారీ వర్షాలు, వరదల కారణంగా విజయవాడ నగరం అతలాకుతలం అయ్యింది. విజయవాడ ప్రజలను ఆదుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం కూడా శక్తివంచన లేకుండా పనిచేస్తుంది. ఈ క్రమంలోనే గత ఐదు రోజుల్లో సుమారు పది లక్షల మందికి ఆహారం అందించామని అక్షయపాత్ర గుంటూరు, విజయవాడ ప్రెసిడెంట్ వంశీదాస ప్రభు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, దివీస్ ల్యాబ్ సహకారంతో కేవలం ఐదు రోజుల్లో 10 లక్షల మందికి ఆహారం పంపిణీ చేయగలిగామని వంశీదాస ప్రభు అన్నారు.