ఫోన్ రాగానే మొదట పలికే పదం హలో. ఈ పదం టెలిఫోన్ ఆవిష్కరణ కాకముందు నుంచే వాడుకలో ఉంది. ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ ప్రకారం holla లేదా hollo అనే పదాల నుంచి "hellow" రూపుదిద్దుకుంది. దూరంగా ఉన్నవారిని పిలిచేందుకు ఇది ఉపయోగించేవారు. టెలిఫోన్ ఆవిష్కరణ తర్వాత ‘హలో’తోనే సంభాషణ మొదలెట్టాలంటూ సూచనలు రావడంతో ఇది పరిపాటిగా మారింది. ఇప్పుడంతా వాట్సాప్‌లో హాయ్, హేయ్, బ్రో వంటి పదాలతో పలకరించేస్తున్నారు.