ప్రస్తుతం చిన్నాపెద్దా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ క్యాన్సర్ మహమ్మారి కబళిస్తుంది. ఈ క్రమంలో కింది లక్షణాలు కనబడితే క్యాన్సర్ సోకే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అవేమిటంటే.. రాత్రిపూట మరీ ఎక్కువగా చెమట పట్టటం, మలంలో, మూత్రంలో రక్తం పడటం, మూడు వారాల కన్నా ఎక్కువగా గొంతు మారటం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు.