నిద్ర లేపినా లేవని వైద్యురాలు.. శిశువు మృతి

77చూసినవారు
నిద్ర లేపినా లేవని వైద్యురాలు.. శిశువు మృతి
AP: కాకినాడ జిల్లా తాళ్లరేవు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం శిశువు ప్రాణం తీసింది. పెదబొడ్డు గ్రామానికి చెందిన మాధురిని శుక్రవారం ప్రసవానికి ఆసుపత్రిలో చేర్పించారు. శనివారం తెల్లవారుజామున నొప్పులు మొదలవ్వగా, వైద్య సిబ్బంది నిద్రలేవకపోవడంతో, స్వీపర్ సాయంతో ప్రసవించింది. శిశువు కదలకపోవడంతో కాకినాడ GGHకు తరలించగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై కుటుంబం ఆందోళన చేపట్టింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్