అధైర్యపడొద్దు.. అండగా ఉంటా: జగన్

76చూసినవారు
అధైర్యపడొద్దు.. అండగా ఉంటా: జగన్
AP: అధైర్యపడొద్దని.. వైసీపీ అండగా ఉంటుందని రైతులు, ఎండీయూ వాహన డ్రైవర్లకు మాజీ సీఎం జగన్ భరోసా ఇచ్చారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జగన్‌ను పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన రైతులు, ఎండీయూ వాహన డ్రైవర్ల యూనియన్ ప్రతినిధులు కలిశారు. పంటలకు గిట్టుబాటు ధర లేకుండా పోయిందని రైతులు, జీవనోపాధి కోల్పోయామని డ్రైవర్లు వాపోయారు. దాంతో వారికి అండగా ఉంటామని జగన్ ధైర్యం చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్