సంగీత దర్శకుడు తమన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తాజాగా నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. 'ఇప్పుడు అమ్మాయిలు ఇండిపెండెంట్ అయ్యారు. ఒకరి మీద వాళ్లు బతకాలని అనుకోవడం లేదు. సోషల్ మీడియా ప్రభావం ఎక్కువైంది. జనాల మైండ్ సెట్ మారింది. కలిసి ఉండే ఆలోచనాధోరణి మారిపోయింది. పెళ్లి చేసుకున్నా కూడా వెంటనే విడిపోతోన్నారు. నన్ను ఎవరైనా సలహా అడిగితే మాత్రం పెళ్లి వద్దు అనే అంటాను' అని చెప్పుకొచ్చారు.