అతి తెలివి ప్రదర్శించొద్దు.. నటుడు విశాల్‌పై హైకోర్టు ఆగ్రహం

73చూసినవారు
అతి తెలివి ప్రదర్శించొద్దు.. నటుడు విశాల్‌పై హైకోర్టు ఆగ్రహం
‘‘ఇది షూటింగ్ కాదు.. అతి తెలివి ప్రదర్శించవద్దు’’ అంటూ కోలీవుడ్ ప్రముఖ నటుడు విశాల్‌పై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమా తీస్తానని విశాల్ తమ నుంచి రూ. 21.29 కోట్లు అప్పుగా తీసుకున్నాడని 2022లో లైకా ప్రొడక్షన్స్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. కోర్టు తీర్పును ఉల్లంఘించారని ఈ ఏడాది జూన్‌లో లైకా సంస్థ మరోమారు విశాల్‌పై కోర్టు ధిక్కరణ కేసు వేసింది. గురువారం విశాల్ వాదనలు విన్న కోర్టు.. విశాల్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది.

సంబంధిత పోస్ట్