భారత్‌కు చెందిన షూటర్ స్వప్నిల్ కుశాలే ఒలింపిక్స్-2024లో కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇండియన్ రైల్వేలో ట్రావెలింగ్ టిక్కెట్ ఎగ్జామినర్ (TTE)గా పని చేస్తున్న ఆయనకు డబుల్ ప్రమోషన్ దక్కింది. ముంబైలోని స్పోర్ట్స్ సెల్‌లో ఇండియన్ రైల్వేస్ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (OSD)గా ఆయన ప్రమోషన్ పొందారు. కుశాలే 2015 నుంచి సెంట్రల్ రైల్వేస్‌లో పనిచేస్తున్నాడు.