అప్పుడప్పుడూ బీర్ తాగడం మంచిదేనంటున్నారు డాక్టర్లు. అలాగని రోజూ అదేపనిగా తాగుతుంటే ఆరోగ్యంపై దుష్ప్రభావాలు తప్పవట. రోజూ బీర్ తాగితే బరువు పెరుగుతారు. బరువు పెరగడం వల్ల ఊబకాయం తదితర సమస్యలు వేధిస్తుంటాయి. ఎక్కువగా బీర్ తాగడం కాలేయం చెడి పోవడానికి కారణమవుతుంది. అలాగే.. గుండె జబ్బులు కూడా వెంటాడతాయి. అతిగా బీర్ తీసుకుంటే లివర్, ఛాతి, పెద్ద పేగు, అన్నవాహిక క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది.