AP: సీఎం కాన్వాయ్‌లోని వాహనశ్రేణిలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తోన్న ఎండీ అమీన్ బాబు గుండెపోటుతో మరణించారు. అమీన్ మృతిపట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. సీఎం కాన్వాయ్‌లో డ్రైవర్‌గా చాలాకాలంగా అమీన్ విధులు నిర్వహిస్తున్నారు. అర్ధరాత్రి గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తెల్లవారుజామున ఆయన మృతి చెందారు. విషయం తెలుసుకున్న సీఎం ఘటనపై విచారం వ్యక్తం చేశారు.