ఏపీ ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా 80% రాయితీపై రైతులకు డ్రోన్లు అందిస్తోంది. ఎరువులు, పురుగుమందుల పిచికారీ కోసం ఈ డ్రోన్లను వినియోగించేలా చర్యలు తీసుకుంది. ఖర్చులు తగ్గించి దిగుబడులు పెంచే లక్ష్యంతో ఈ సంవత్సరం జిల్లాల వారీగా 875 డ్రోన్ యూనిట్లు మంజూరు చేసింది. యూనిట్ ధర రూ.10 లక్షలు కాగా రూ. 8లక్షలు ప్రభుత్వమే భరిస్తోంది. ఐదుగురు రైతుల గ్రూపులను లబ్ధిదారులుగా ఎంపిక చేసింది.