ఏపీ వ్యాప్తంగా సంచలన సృష్టిస్తున్న దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి వ్యవహారంపై అమెరికాలో ఉంటున్న ఆమె భర్త మహేష్ చంద్రబోస్ స్పందించారు. 'నాకు రాజకీయాలంటే ఇష్టం లేదు. కానీ మాధురి ఇష్టపడటంతో వైసీపీలోకి వెళ్లేందుకు మద్దతిచ్చాను. నా భార్యపై నాకు పూర్తి నమ్మకం ఉంది. ఆమె రాజకీయంగా ఎదుగుతోందనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. మాధురిపై ఎవరెన్ని చెప్పినా నేను నమ్మను' అని స్పష్టం చేశారు.