AP: రైతులు పంట నష్టపరిహారం పొందాలన్నా, వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించుకోవాలన్నా కీలకమైన ఈ-క్రాప్ నమోదు ప్రక్రియను వ్యవసాయ శాఖ అధికారులు వేగవంతం చేశారు. రబీ పంటలకు సంబంధించి వ్యవసాయ శాఖ సిబ్బంది, వీఆర్ఎలు గ్రామాల్లో పర్యటిస్తూ భూమి విస్తీర్ణం, ప్రస్తుతం సాగులో వున్న పంటల వివరాలను ఆన్లైన్ లో నమోదు చేస్తున్నారు. ఈ-క్రాప్ నమోదుకు ఈ నెల 25వ తేదీ వరకు గడువు వుంది.